Telangana Election: ప్రధాని మోదీ సభకు హాజరు కాని ఎమ్మెల్యే రాజాసింగ్.. కారణం ఏంటంటే..?
అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ భారీ సభను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామంటూ నరేంద్ర మోదీ ప్రకటన కూడా చేశారు.

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ భారీ సభను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామంటూ నరేంద్ర మోదీ ప్రకటన కూడా చేశారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రధాని మోదీ మొదటి సభ కావడంతో.. బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్త ఎత్తున నేతలుచ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి తోపాటు ముఖ్య నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్ లాంటి నాయకులు హాజరయ్యారు. కానీ అదే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రాజాసింగ్ మాత్రం పాల్గొనకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే రాజాసింగ్‌పైన ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది బీజేపీ. దీంతో ఆయనకే తిరిగి గోషామహాల్ నియోజకవర్గ స్థానాన్ని కట్టబెట్టింది. అయినా స్వయంగా ప్రధాని మోదీ పాల్గొంటున్న భారీ బహిరంగ సభకు రాజాసింగ్ హాజరు కాకపోవడం కొత్త చర్చకు దారితీసింది. అయితే ఇతర ప్రాంతాలలో జరిగే మోదీ సభకు రాజాసింగ్ హాజరు కాకపోతే ఎలాంటి సమస్య ఉండకపోయేదీ. కానీ, గోషామహాల్ అసెంబ్లీ పరిధిలో జరిగే కార్యక్రమంలో రాజా సింగ్ కనిపించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. ”ఎల్బీ స్టేడియంలో జరిగిన సభను కార్యకర్తలతో కలిసి నేను కూడా టీవీలో చూసినా.. నరేంద్రమోదీ, బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను టీవీలో చూడటం నాకు బాధగా ఉంది. సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం నా గోషామహల్ నియోజకవర్గంలో ఉంది.. నేను ఇప్పటికే నామినేషన్ వేశాను. ఆ సభలో పాల్గొంటే ఆ సభ ఖర్చు మొత్తం నా ఖాతాలో వేసే అవకాశం ఉంది. ఈ అంశంపై నేను, నా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌తో మాట్లాడినం.. వారు కూడ అదే చెప్పారు. మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వివరించారు. దీంతో నేను సభకు హాజరు కాలేదు. మా గురువు రేంద్రమోదీ పాల్గొన్న సభలో నేను పాల్గొనలేకపోవడం బాధగా ఉంది.” అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
మొత్తానికి ఖర్చు లెక్కకు భయపడి మోదీ పాల్గొన్న సభకు రాజా సింగ్ హాజరు కాలేదని తెలపడం జరిగింది. దీంతో రాజాసింగ్ రాలేదన్న చర్చకు పులిస్టాప్ పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
