Telangana Election: 82 ఏళ్ళ వయస్సులో నామినేషన్ వేసిన వృద్ధురాలు.. కారణం తెలిసి అధికారుల షాక్!
ఓ స్వాతంత్ర సమరయోధురాలి దీనావస్థ అంతా ఇంతా కాదు. తన పెద్ద కొడుకు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో, చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది ఓ తల్లి. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఓ స్వాతంత్ర సమరయోధురాలి దీనావస్థ అంతా ఇంతా కాదు. తన పెద్ద కొడుకు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో, చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది ఓ తల్లి. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 82 ఏళ్ల వయసున్న ఓ బామ్మ నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. నిజాం విముక్తి కోసం పోరుబాట పట్టిన యోధుడి భార్య కూడా అయిన ఆమె నామినేషన్ వేయడం కలకలం సృష్టిస్తోంది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన చీటి శ్యామల జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు మురళీధర్ రావు భార్య చీటి శ్యామల నామినేషన్ వేయడానికి గల కారణాలు వివరించారు. తమ కుటుంబానికి చెందిన ఇంటి విషయంలో తన పెద్ద కొడుకుతో వచ్చిన విబేధాల కారణంగానే తాను నామినేషన్ వేయాల్సి వచ్చిందని శ్యామల వివరించారు. పెద్ద కొడుకు రామారావు కోర్టును ఆశ్రయించడంతో ఇంట్లో నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే వృద్దాప్యానికి చేరుకున్న తానిప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కనీసం తన బాగోగులు కూడా పెద్ద కొడుకు చూసుకోవడం లేదని శ్యామల ఆరోపించారు.
తనకు న్యాయం చేయాలని దేశంలోని ప్రముఖలందరికీ వినతి పత్రాలు పంపించింది శ్యామల. అయినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 82 ఏళ్ల వయసుకు వచ్చిన తనపట్ల చూపుతున్న వివక్ష సరికాదని, తన గోడు సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే జగిత్యాలలో నామినేషన్ వేశానన్నారు. తన పెద్ద కొడుకు వల్ల జరిగిన అన్యాయాన్ని సవరించి తన ఇంటిని తనకు ఇప్పించాలని కూడా కోరుతున్నారు.
మరో వైపున ఆమెను బెదిరింపులకు కూడా గురిచేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు బంధువులని చెప్తూ భయపెడుతున్నారని కూడా చీటి శ్యామల తరుపు బంధువులు వివరించారు. ఆస్థి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలన్న డిమాండ్‌తో నామినేషన్ వేసినట్టు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
