AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Batti Vikramarka: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి.. సచివాలయంలో ఆ ఫైలుపైనే తొలి సంతకం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు.

Batti Vikramarka: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి.. సచివాలయంలో ఆ ఫైలుపైనే తొలి సంతకం
Deputy Cm Batti Vikramarka
Srikar T
|

Updated on: Dec 14, 2023 | 10:23 AM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వేద పండితుల మంత్రాల మధ్యలో తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తన కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైళ్లను అందజేశారు కార్యదర్శులు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలు పై మూడో సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. ఇలా చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఒక్కొదానికి అవసరమైనన్ని నిధులను విడుదల చేస్తూ పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సాఫీగా కొనసాగించేందుకు తగు కార్యాచరణను రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..