AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ధరణి ప్రక్షాళనకి రంగం సిద్ధం.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఇవే..

రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy: ధరణి ప్రక్షాళనకి రంగం సిద్ధం.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఇవే..
CM Revanth Reddy
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Dec 14, 2023 | 6:40 AM

Share

రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్యశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి దామోదర రాజ నర్సింహా, రెవిన్యూ, హౌసింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని ముఖ్యమంత్రి సీఎస్‎ను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంవో అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీంలు పాల్గొనగా.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్ రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..