Hyderabad Metro: రూట్ మారుతోంది.. గచ్చిబౌలి టూ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్లాన్ రద్దు.!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ ప్లాన్‌ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్‌ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు.

Hyderabad Metro: రూట్ మారుతోంది.. గచ్చిబౌలి టూ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్లాన్ రద్దు.!
Hyderabad Metro
Follow us

|

Updated on: Dec 14, 2023 | 9:35 AM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ ప్లాన్‌ నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్‌ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్‌మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువన్నారు. ఓఆర్‌ఆర్‌ ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్లు సీఎం తెలిపారు.

విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌.. ప్లాన్‌-B తయారు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. పాతబస్తీలో అధిక జనాభా దృష్ట్యా.. అక్కడ నుంచి మెట్రో అలైన్‌మెంట్‌ ఉండాలని సీఎం అన్నారు. ఎంజీబీఎస్‌, ఫలక్‌నుమా, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో అలైన్‌మెంట్‌ ఉండాలన్నారు. పాతబస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంతో L&Tపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

లేదా ఎంజీబీస్‌, ఫలక్‌నుమా, బార్కాస్, పహాడీషరీఫ్, తుక్కుగూడ, శ్రీశైలం రోడ్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి మరో రూట్‌ ఉండేలా అధికారులు పరిశీలించి ప్లాన్‌ చేయాలని సూచించారు. అలాగే L&T మెట్రో రైలు, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసీ వెంట రోడ్‌ కమ్‌ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర పూర్తి కానప్పటికీ మెట్రో రైలు కాంట్రాక్టర్‌ L&Tకి అనేక ప్రయోజనాలు అందజేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆదేశించారు.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్