Telangana Budget 2024-25: రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..

రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 33 రకాల సన్న వడ్లకు ఇది వర్తిస్తుందని అన్నారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఇక భూమి లేని రైతు కూలీలకు...

Telangana Budget 2024-25: రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
Tg Budget 2024
Follow us

|

Updated on: Jul 25, 2024 | 2:03 PM

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. ఇక బడ్జెట్‌లో ప్రభుత్వం శుభవార్త తెలిపారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతిగా, వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చే ఆలోచనతో ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 33 రకాల సన్న వడ్లకు ఇది వర్తిస్తుందని అన్నారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఇక భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూమి లేని రైతు కూలీలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లందరికీ భరోసా ఇవ్వనుందన్ని చెప్పుకొచ్చారు.

ఇక బీమా విషయంలో కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. పంట నష్టం కారణంగా ఆర్థికంగా చితికిపోయిన రైతులకు అండగా నిలచే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సఫల్ యోజన పథకంలో చేరనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. పైసా ఖర్చు లేకుండా రైతుకు పంట భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..