మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ యాప్‌లోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చు
హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ అందుబాటులోకి వచ్చింది మెట్రో. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభించడంతో హైదరాబాదీలు మెట్రోవైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ఇక కాలక్రమేణా మెట్రో టికెట్ బుకింగ్స్‌లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి. ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసే నేపథ్యంలో పలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ అందుబాటులోకి వచ్చింది మెట్రో. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభించడంతో హైదరాబాదీలు మెట్రోవైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ఇక కాలక్రమేణా మెట్రో టికెట్ బుకింగ్స్‌లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి. ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసే నేపథ్యంలో పలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మొబైల్ యాప్, వాట్సాప్‌తో పాటు పలు బుకింగ్స్ యాప్స్ ద్వారా మెట్రో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే, తాజాగా ప్రముఖ బైక్ షేరింగ్ యాప్ ర్యాపిడో ద్వారా కూడా మెట్రో రైల్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. త్వరలోనే ర్యాపిడో ద్వారా మెట్రో రైల్ టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం లభించింది. ఈ మేరకు మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది. ఈ సేవలతో ప్రయాణికులకు మెట్రో స్టేషన్‌కు వెళ్లకుండానే ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్షణాల్లో మెట్రో టికెట్‌ను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎల్ & టీ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా .. నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు కేవీబీ రెడ్డి. ర్యాపిడోతో కొత్త భాగస్వామ్యం ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందిస్తుందని మెట్రో ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాదం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్
ఇష్టం లేని కాపురం వాళ్లది !! రాజ్ తరుణ్ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

