బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??

బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??

Phani CH

|

Updated on: Jul 25, 2024 | 1:58 PM

బాదం పప్పుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలోని ఫాస్ఫరస్‌, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే బాదంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో నిజమెంత? బాదం పప్పులో నూనె ఉంటుందనేది వాస్తవమే.. అయినప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

బాదం పప్పుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలోని ఫాస్ఫరస్‌, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే బాదంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో నిజమెంత? బాదం పప్పులో నూనె ఉంటుందనేది వాస్తవమే.. అయినప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు. అయితే బాదంను నెయ్యిలో వేయించుకొని తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం ఖాయమని చెబుతున్నారు. బాదంలో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు రెండు బాదంలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్

ఇష్టం లేని కాపురం వాళ్లది !! రాజ్‌ తరుణ్‌ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్

Indian 2: భారతీయుడు2 OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??

Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా