AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఢీ కొట్టాడు.. దారి మధ్యలో మృతి చెందడంతో రోడ్డు పక్కన మృతదేహాన్ని పారేశాడు..

అతివేగం ఓ అమాయ ప్రాణాన్ని బలి తీసుకుంది. బొలేరో వాహనంలో అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న పాదచారిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలై బాధతో విలవిలలాడుతున్న అతన్ని కాపాడేందుకు..

Road Accident: ఢీ కొట్టాడు.. దారి మధ్యలో మృతి చెందడంతో రోడ్డు పక్కన మృతదేహాన్ని పారేశాడు..
Road Accident
Srilakshmi C
|

Updated on: Jul 28, 2023 | 7:17 AM

Share

ఆమనగల్లు, జులై 28: అతివేగం ఓ అమాయ ప్రాణాన్ని బలి తీసుకుంది. బొలేరో వాహనంలో అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న పాదచారిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలై బాధతో విలవిలలాడుతున్న అతన్ని కాపాడేందుకు నిందితుడు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. ఐతే మార్గం మధ్యలోనే క్షతగాత్రుడు మృతి చెందడంతో మృతదేహాన్ని రోడ్డు పక్కన పారేసి పారిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన మహబూబ్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై బాల్‌రామ్‌ వివరాల ప్రకారం..

ఆమనగల్లు పరిధిలో చంద్రాయన్‌పల్లి తండాకు చెందిన జఠావత్‌ బద్యానాయక్‌ అలియాస్‌ సురేష్‌ (39) అనే వ్యక్తి సూర్యలక్ష్మి కాటన్‌ మిల్లులో పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మిల్లులో పనికి పయనమైన సురేష్‌ గురువారం తెల్లవారుజామున శ్రీశైలం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తోన్న బొలేరో వాహనం అదుపుతప్పి అతన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతలో ఢీ కొట్టిన బొలేరో డ్రైవర్‌ ఏమనుకున్నాడో బాధితుడిని చికిత్స కోసం కల్వకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్ది దూరం వెళ్లగానే మార్గం మధ్యలోనే సురేష్‌ మృతి చెందాడు.

దీంతో డ్రైవర్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడవేసి పారిపోయాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎవరైనా హత్య చేశారేమోనని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో సురేష్‌ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాల్‌రామ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
'పెద్ది' డైరెక్టర్ సినిమా.. చిరంజీవి రియాక్షన్ ఏంటో తెలుసా?వీడియో
'పెద్ది' డైరెక్టర్ సినిమా.. చిరంజీవి రియాక్షన్ ఏంటో తెలుసా?వీడియో
భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు..
భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు..
రోహిత్ రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
రోహిత్ రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..