AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSB Bank Jobs 2026: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే దరఖాస్తు చేసుకోండి

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుబంధ సాంకేతిక విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా..

PSB Bank Jobs 2026: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే దరఖాస్తు చేసుకోండి
Punjab And Sind Bank Manager Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 14, 2026 | 7:04 AM

Share

బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుబంధ సాంకేతిక విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • మేనేజర్ పోస్టుల సంఖ్య: 4
  • సీనియర్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 3
  • చీఫ్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 1

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో మేనేజర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో BE/B.Tech లేదా ME/M.Tech డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట పని అనుభవం కూడా కలిగి ఉండాలి. పోస్టును బట్టి అనుభవ అర్హతలు మారవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి జూన్‌ 1, 2026వ తేదీ నాటికి సంబంధిత పోస్టును అనుసరించి 31 నుంచి 45 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు ఐదేళ్లు, బీసీ కేటగిరీ అభ్యర్ధులకు మూడేళ్లు, వికలాంగ కేటగిరీ అభ్యర్ధులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్ధులకు ఐదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నిర్వహిస్తారు. అభ్యర్థుల అర్హతలు, అనుభవం, పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు స్థాయికి అనుగుణంగా ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ అందించబడుతుంది. ఇతర భత్యాలు, సేవా నిబంధనలు బ్యాంకు నియమాల ప్రకారం ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అనుభవం కలిగిన ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశంగా చెప్పవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కోరుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో మేనేజర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు 100 మార్కులకు 105 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి 60 ప్రశ్నలకు 60 మార్కులు చొప్పున అడుగుతారు.

Follow Us
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..