AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు

Telangana Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదైంది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు
Earthquake In Bhadradri Kothagudem
Srilakshmi C
|

Updated on: Jun 14, 2026 | 7:25 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురైనారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నిద్రలో ఉండగానే ప్రకంపనలు గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రకంపనలు స్పష్టంగా అనిపించడంతో స్థానికుల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..