Telangana: మార్కెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం పత్తికి రికార్డ్ ధర.. 9వేలు దాటి ఆల్‌టైంహైకి చేరుకున్న తెల్లబంగారం

Telangana: తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్ల బంగారానికి రికార్డ్ ధర పలుకుతోంది. ఏకంగా క్వింటాల్‌కు 9 వేల..

Telangana: మార్కెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం పత్తికి రికార్డ్ ధర.. 9వేలు దాటి ఆల్‌టైంహైకి చేరుకున్న తెల్లబంగారం
Cotton Surges To Record Pri
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2022 | 11:37 AM

Telangana: తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్ల బంగారానికి రికార్డ్ ధర పలుకుతోంది. ఏకంగా క్వింటాల్‌కు 9 వేల రూపాయలు దాటి దాటి ఆల్ టైం హైకి చేరింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాల్‌కు 9వేల 310 రూపాయలకు అమ్ముడుపోయింది. మంచి లాభసాటి ధర రావటంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఈసారి పత్తి దిగుబడి తక్కువ రావడంతో రేటు ఎక్కువ ఉందంటున్నారు వ్యాపారులు.

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరి క్వింటాలుకు రూ.9,310 పలికాయి. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ నూలుకు అధిక డిమాండ్ ఉన్నందున ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో తెల్ల బంగారం ధర క్వింటాల్‌కు సీసీఐ మద్దతు ధర రూ.6,025 కంటే చాలా ఎక్కువ కావడం ఆశ్చర్యకరం. సీజన్ ప్రారంభం నుంచే పత్తి ధర క్వింటాల్‌కు రూ.7 వేలకు పైగానే ఉండడంతో క్రమేణా పుంజుకుంది.

తెలంగాణ, ఏపీ, కర్ణాటక మినహా… ఇతర రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల పత్తికి డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నాణ్యమైన పత్తి లభిస్తుండటంతో ధరలు ఊపందుకున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోనూ పత్తికి డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో క్వింటాలు పత్తికి 10 వేలు దాకా పలికే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా ధర పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ఓఎన్జీసీలో భారీ వేతనాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చవరి తేదీ..

 జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న ప్రధానమంత్రి మోడీ… ఫిట్ ఇండియా అంటూ సందేశం.. వీడియో వైరల్..

ఇద్దరు ‘ఛాంపియన్‌’లతో గబ్బర్ శిక్షణ.. వైరలవుతోన్న ఫొటో