Telangana Corona Cases: కొంప ముంచిన న్యూ ఇయర్ వేడుకలు.. తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
Telangana Corona Cases: న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్ లకి వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగర వాసులు..
Telangana Corona Cases: న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్ లకి వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగర వాసులు.. తిరిగి రావడంతో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు, ముడు రోజులుగా మూడు వందల కు పైగా కేసుల నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 482 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 294, రంగారెడ్డి 55, మేడ్చల్ 48 చొప్పున అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలో గడిచిన మూడు రోజులుగా రెండు వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివిటీ రేట్ పెరుగుతోంది.
కొంప ముంచిన గోవా న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్‌కు చెందిన పలువురు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాకు వెళ్లారు. ఇప్పడదే కొంప ముంచుతోంది. కోవిడ్ కేసుల విషయంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 31వ తేదీ డిసెంబర్ రాత్రి గోవాలోని బాగా బీచ్ కేంద్రంగా వేలల్లో గుమికుడి సెలెబ్రేషన్స్ చేసుకున్న టూరిస్ట్ లు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండటంతో ఇక్కడి ప్రజలు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు. అలా వెళ్లి వచ్చిన వారిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా న్యూ ఇయర్ కి గోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కి వెళ్లొచ్చిన హైదరాబాద్ యువకులకు కోవిడ్ పోసిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. న్యూ ఇయర్ సందర్బంగా టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్లొచ్చిన ఇతర జిల్లాల వారిలోనూ కోవిడ్ బయటపడుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో యువకులు గోవాకి వెళ్లారు. అలా వెళ్లి వచ్చినవారిలో ఇప్పటి వరకు 32 మందికి పాజిటివ్ అని తేలింది. రెండు డోస్‌ల వ్యాక్సీన్ తీసుకున్న వారిలోనూ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో సిరో సర్వే.. ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మరోసారి సిరో సర్వే నిర్వహించనుంది. ఐసిఎంఆర్, ఎన్ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల్లో సిరో సర్వే నిర్వహించనున్నారు. 16వేల మంది నమూనాలు సేకరించి అధ్యయనం చేయనున్నారు. రక్తం లోని యాంటీ బాడీల వృద్ధిపై అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
Also read:
RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్ ఫోన్ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..