PM Modi in Gym: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న ప్రధానమంత్రి మోడీ… ఫిట్ ఇండియా అంటూ సందేశం.. వీడియో వైరల్..

PM Modi in Gym: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. "ఫిట్ ఇండియా" అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా..

PM Modi in Gym: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న ప్రధానమంత్రి మోడీ... ఫిట్ ఇండియా అంటూ సందేశం.. వీడియో వైరల్..
Pm Modi At Gym
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2022 | 11:24 AM

PM Modi in Gym: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. “ఫిట్ ఇండియా” అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తూ  స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాన మంత్రి మోడీ జిమ్‌కి వెళ్లారు. ప్రధాని మోడీ జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ  శంకుస్థాపనకు వెళ్లిన మోడీ అక్కడి కాంప్లెక్స్‌లో ఉన్న జిమ్‌ను సంద‌ర్శించారు.  అంతేకాదు ప్రధాని మోడీ కొంచెం సేపు జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేశారు. బాడీవెయిట్ లాట్‌పుల్ మెషిన్‌తో ఎక్సర్‌సైజ్ చేశారు. దాదాపు 15 సార్లు ఆ మెషిన్‌ను కిందికి పైకి చేస్తూ ఎక్సర్‌సైజ్ చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో షికారు చేస్తోంది.

అయితే ప్రధాని మోడీ ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనన్న సంగతి తెలిసిందే.  ఆయన రోజూ ఉదయం వ్యాయామం, యోగా ను చేస్తారు. అంతేకాదు  దేశ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇది పాటించండి అంటూ మోడీ  ఓ మంత్రం కూడా ఇచ్చారు. “ఫిట్ నెస్ డోస్, రోజూ అరగంట” అనే మంత్రం. ప్రజల ఆరోగ్యం, ఆనందం ఈ మంత్రంలో దాగి  ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

అంతేకాదు .. మనం క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు, మనం ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం వివిధ రంగాల్లో విజయాన్ని అందిస్తుంది’ అని  మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా, భంగిమ, వ్యాయామం, నడక, రన్నింగ్, హెల్తీ డైట్, స్విమ్మింగ్ ఇవన్నీ మన దినచర్యలో భాగం గా మార్చుకోవాలని ప్రధాని మోడీ చెప్పారు.

Also Read:  శనిప్రభావాన్ని నివారించే హనుమాన్ చాలీసా.. రోజుకు ఎన్నిసార్లు, ఎక్కడ పఠించాలంటే..

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి