AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONGC Recruitment 2022: ఓఎన్జీసీలో భారీ వేతనాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చవరి తేదీ..

ONGC Recruitment 2022: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

ONGC Recruitment 2022: ఓఎన్జీసీలో భారీ వేతనాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చవరి తేదీ..
Shiva Prajapati
|

Updated on: Jan 04, 2022 | 11:27 AM

Share

ONGC Recruitment 2022: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 21 ఖాళీలను భర్తీ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఓఎన్‌జిసి అధికారిక వెబ్‌సైట్ www.ongcindia.comలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఓఎన్‌జిసి రిక్రూట్‌మెంట్ 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15, 2021 నుండి ప్రారంభమవగా.. దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

ఓఎన్‌జిసి రిక్రూట్‌మెంట్ 2022 ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ ప్రక్రియ డిసెంబ్ 15, 2021న మొదలైంది. అప్లికేషన్స్ చివరి తేదీ జనవరి 4, 2022.

ఖాళీల వివరాలు: HR ఎగ్జిక్యూటివ్: 15 పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 6

వయో పరిమితి: అన్‌రిజర్వ్‌డ్/ఈడబ్ల్యూఎస్ : 30 సంవత్సరాలు ఓబీసీ(ఎన్‌‌సిఎల్): 33 సంవత్సరాలు ఎస్సీ/ఎస్టీ : 35 సంవత్సరాలు పిడబ్ల్యూబిడి : 40 సంవత్సరాలు

విద్యార్హత.. 1. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అభ్యర్థులు కనీసం 60% మార్కులతో పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్ఆర్‌డి/హెచ్ఆర్ఎం లో స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కలిగి ఉండాలి. లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్/ఐఆర్/లేబర్ వెల్ఫేర్‌లో కనీసం 60% మార్కులతో, లేదా కనీసం 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. పీఎంఆర్/లేబర్ వెల్ఫేర్‌లో రెగ్యూలర్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణ సాదించాలి. లేదా కనీసం 60% మార్కులతో ఐఐఎం నుండి పీడీడీఎం లో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. 2. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేట్/కనీసం 2 సంవత్సరాల పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో కనీసం 60% డిప్లొమా కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈ డబ్ల్యూఎస్, ఓబీసీ అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 300 చెల్లించవలసి ఉంటుంది. రిజర్వ్‌డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు దీని నుండి మినహాయింపు ఉంటుంది. అంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట.

Also read:

Telangana Corona Cases: కొంప ముంచిన న్యూ ఇయర్ వేడుకలు.. తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

India VS China : భారత్‌ వర్సెస్‌ చైనా వయా శ్రీలంక ప్లాన్‌ సిద్ధమవుతోందా?.. డ్రాగన్‌ చర్యలకు చెక్ పెట్టేనా?..

WHO on Covid: ఒమిక్రాన్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అవేంటంటే..!