India vs South Africa ODI Series: ఇద్దరు ‘ఛాంపియన్‌’లతో గబ్బర్ శిక్షణ.. వైరలవుతోన్న ఫొటో

Viral Photo: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌ల శిక్షణకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

India vs South Africa ODI Series: ఇద్దరు 'ఛాంపియన్‌'లతో గబ్బర్ శిక్షణ.. వైరలవుతోన్న ఫొటో
Shikhar Dhawan
Follow us
Venkata Chari

|

Updated on: Jan 04, 2022 | 11:22 AM

India vs South Africa ODI Series: భారత క్రికెట్ జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఫుల్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. అందుకోసం శిక్షణలో చెమటలు పట్టిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో సత్తా చాటేందుకు రాటుదేలుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. ప్రస్తుతం ధావన్, భువనేశ్వర్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరు ఆటగాళ్లు రోహిత్ శర్మతో శిక్షణ పొందడం కనిపించింది. వీరిద్దరితో కలిసి దిగిన ఫొటోను ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

2021లో శ్రీలంకతో ధావన్‌, భువనేశ్వర్‌ల చివరి వన్డే మ్యాచ్‌‌లో కనిపించారు. ప్రస్తుతం మరోసారి ఈ ఇద్దరు ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో కనిపించనున్నారు. అంతకుముందు ధావన్, భువీ శిక్షణ తీసుకుంటున్నారు. వీరితో పాటు రోహిత్ శర్మ కూడా జాయిన్ అయ్యాడు. ఈమేరకు ధావన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ఫోటోను పంచుకున్నాడు. అందులో రోహిత్, భువీ కూడా అతనితో ఉన్నారు. ఈ ఫోటోతో ఆసక్తికర క్యాప్షన్ అందించాడు. ఈ ముగ్గురు టీమ్ ఇండియా ఆటగాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోన్నాయి.

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ధావన్ 128 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడిన భువనేశ్వర్ మూడు వికెట్లు తీశాడు. ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే భువనేశ్వర్ ఇప్పటి వరకు 119 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఒకసారి ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు. ధావన్ ఇప్పటి వరకు 145 వన్డేల్లో 6105 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ధావన్ అత్యుత్తమ స్కోరు 143 పరుగులుగా నమోదైంది.

Also Read: IPL 2022: అహ్మదాబాద్ హెచ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్.. ఇతర సిబ్బంది కూడా ఫిక్స్?

IND vs SA: మళ్లీ విఫలమైన పుజారా రహానె.. వారికిదే చివరి ఛాన్స్ అన్న గవాస్కర్..