Telangana Covid-19: హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గింది. అయినప్పటికీ.. మహమ్మారి ప్రభావం
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గింది. అయినప్పటికీ.. మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,20,213 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 647 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,40,659 మంది కరోనా బారిన పడ్డారు. కాగా.. కరోనాతో ఇద్దరు మరణించారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 3,780 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇదిలాఉంటే.. ఒక్క రోజులో 749 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 6,27,254 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,625 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు97.90 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,12,24,462 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 77 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ తరువాత కరీంనగర్ జిల్లాలో 76 కేసులు, ఖమ్మం జిల్లాలో 58, వరంగల్ అర్బన్‌లో 47 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
Also Read: