Hyderabad: మైండ్‌స్పేస్‌లో రెండు బ్లాక్స్ క్షణాల్లో కూల్చివేత.. భారీగా అలుముకున్న దుమ్ము, ధూళి..
భారీ బిల్డింగ్స్ మధ్య ఉన్న ఈ భవనాల కూల్చివేతలో ఇతర బిల్డింగ్స్ కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భవనాల కూల్చివేతల్లో అనుభవం ఉన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ కంపెనీ ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కూల్చివేతకు ముందు అలారం మోగించారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. B7, B8 అనే రెండు భవనాలను కేవలం 5 సెకన్లలో నేలమట్టం చేశారు. వీటి పక్కనే భారీ బిల్డింగులున్నాయి.. అయితే వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రెండు భవనాలను పేక మేడల్లా కూల్చివేశారు. రెండు పెద్ద భవనాలను కేవలం ఐదంటే ఐదు సెకన్లలో నేలమట్టం చేశారు..సెకన్లలో చుట్టూ దుమ్ముధూళి వ్యాపించింది. మైండ్‌స్పేస్ ప్రాజెక్టు రీడెవలప్‌మెంట్ ప్రణాళికలో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టారు. భవనాలను కూల్చివేసిన అనంతరం చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా దుమ్మూ, ధూళి అలుముకుంది.
రహేజా మైండ్ స్పేస్‌లోని B బ్లాక్‌లో ఉన్న ఈ రెండు భవనాలు కొంచెం దూరంలో వేరు వేరుగా ఉంటాయి. దీంతో ఈ భవనాలను నేలమట్టం చేయడం కొంచెం ఈజీ అయింది. నాలుగంతస్తులు ఉన్న రెండు బిల్డింగ్స్ ప్లేస్ లో న్యూ బిల్డింగ్స్ ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు.
భారీ బిల్డింగ్స్ మధ్య ఉన్న ఈ భవనాల కూల్చివేతలో ఇతర బిల్డింగ్స్ కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భవనాల కూల్చివేతల్లో అనుభవం ఉన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ కంపెనీ ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కూల్చివేతకు ముందు అలారం మోగించారు. గతంలో ఇలాంటి ప్రక్రియను నోయిడాలో నిర్వహించారు.
ఈ రెండు బిల్డింగులను కొంత కాలం కిందటే.. అధునాతన రీతిలో నిర్మించారు. అయితే ఈ బిల్డింగ్స్ లో అనుకోని విధంగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడినట్లు… ఈ సమస్యలు వల్ల భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి కూల్చివేతకు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఒక క్రమ పద్ధతిలో పేలుడు ప్రక్రియ నిర్వహించారు. ఈ బిల్డింగులు కూల్చివేసిన ప్రదేశాల్లో భారీ భవనాలను నిర్మించనున్నట్లు మైండ్ స్పేస్ కంపెనీ చెబుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








