Telangana: వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం.. పాదయాత్రలో రేవంత్ సంచలన కామెంట్స్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లా చేరుకుంది. ఇక హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ పలు సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలపై
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లా చేరుకుంది. ఇక హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ పలు సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వీరిద్దరూ బిల్లా రంగాల్లాంటి వారని అన్నారు. భూకబ్జాల్లో వీరికి మించిన వారు లేరనీ.. వరంగల్ ఎమ్మెల్యేలైలు దండుపాళ్యం బ్యాచ్ లాంటి వారనీ. వీరు కేవలం భూములనే కాదు.. పందులను కూడా వదలడం లేదని అన్నారు. వరంగల్ దండుపాళ్యం ముఠాకు తానొక హెచ్చరిక జారీ చేస్తున్నాననీ.. మా కార్యకర్తలను వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామనీ అన్నారు. కాంగ్రెస్ జెండా మోసే ప్రతి కార్యకర్తకూ మంచి భవిష్యత్ ఉంటుందనీ. నాయిని రాజేందర్ రెడ్డిలాంటి వారికి సోనియా గాంధీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారాయన.
హనుమకొండలో జరిగిన రేవంత్ పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని అధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది. ఆర్ట్స్ కాలేజీ నుంచి మొదలైన పాదయాత్ర.. అదాలత్, నక్కల గుట్ట, బాలసముద్రం, బస్టాండ్, పబ్లిక్ గార్డెన్ మీదుగా హనుమకొండ చౌరస్తా వరకూ సాగింది. ఏనుగుల గడ్డలో జరిగిన కార్నర్ షోలో.. వీహనుమంతరావు మాట్లాడారు. ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర.. కేసీఆర్ దనీ.. ఇక్కడి రైతులను పట్టించుకోడుగానీ.. పంజాబ్ రైతులపై ప్రేమ ఒలకబోస్తాడనీ ఎద్దేవా చేశారు వీహెచ్. అంతే కాదు మేమంతా కలిసే ఉన్నామనీ.. మా మధ్య ఎలాంటి తగాదాల్లేవనీ అన్నారు హనుమంతరావ్. పైన ఉన్న వాళ్లంతా కలిసి ఉంటేనే.. కింద వాళ్లు క్షేమంగా ఉంటారనీ అన్నారాయన.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నుంచి తానే పోటీచేస్తున్నానని ప్రకటిచుకున్నారు నాయిని రాజేందర్ రెడ్డి. ఇరవై ఏళ్ల త్యాగం వృధా కానివ్వననీ.. ఈసారికి పోటీకి దిగేది దిగేదేనంటూ.. రేవంత్ ముందే కామెంట్ చేశారు రాజేంద్రరెడ్డి. పొరుగు జిల్లాల నుంచి పక్క పార్టీల నుంచి ఎవరొచ్చి కుట్రలు చేసినా సరే ఇక్కడ తానే పోటీ చేస్తానన్నారు నాయిని. నాయిని మాటలు కరెక్ట్ అంటూ కితాబునిచ్చారు వీహెచ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..