Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఢిల్లీ బాట పట్టారు. చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత.. హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా? అనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో సీనియర్ అయిన తనను సంప్రదించకుండా సంజయ్‌ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Congress: ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Telangana Congress
Follow us
Srikar T

|

Updated on: Jun 26, 2024 | 10:01 PM

ఢిల్లీ పెద్దలను కలిశారు జగిత్యాల కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవనరెడ్డి. కేసీ వేణుగోపాల్‌ని కలిసి అసంతృప్తిని విన్నవించుకున్నారు జీవన్‌రెడ్డి. కాంగ్రెస్‌ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్న జీవన్‌రెడ్డి.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. చివరి వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టించిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఢిల్లీ బాట పట్టారు. చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత.. హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా? అనే చర్చకు తెరపడింది. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో సీనియర్ అయిన తనను సంప్రదించకుండా సంజయ్‌ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ రెండు రోజులుగా పార్టీ వర్గాలను టెన్షన్ పెట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు మాట్లాడినా.. ఆయన ఏమాత్రం మెత్తబడలేదు. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి బుజ్జించినా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నందున ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసన్నారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారని.. కానీ ఆ చేరిక అనేది ఆయా ప్రాంతాల కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి అన్నారు. జీవన్‌రెడ్డిని బుజ్జగించడం రాష్ట్ర నేతల వల్ల కాకపోవడంతో ఆయనతో చర్చించేందుకు హస్తిన పెద్దలు రంగంలోకి దిగారు. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్సీ ఫోన్ చేసి జీవన్ రెడ్డితో మాట్లాడారు.

కాంగ్రెస్ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తిన బయల్దేరివెళ్లారు. ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో అంతా కలిసి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చే అంశంపై కూడా చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ హైకమాండ్ హామీతో సంతృప్తి చెందినట్లు తెలిపారు.  ఈ భేటీకీ సహకరించిన వారికి కృతజ్ఙతలు తెలిపారు. ఏది ఏమైనా పార్టీ ఐక్యంగా ఉండటమే తనకు ముఖ్యమన్నారు. కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యానే ఇక్కడికి వచ్చి కలిశామన్నారు. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ, శ్రీధర్ బాబు ఇతర మంత్రులకు, సీనియర్  నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని కాంగ్రెస్ పెద్దలు కేసీ వేణుగోపాల్ చెప్పినమాటపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..