AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లాకప్‌లో కోడి పుంజు.. ఇంతకీ నేరం ఏంటంటే..?

నేరాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి లాకప్‌లలో పెట్టడం షరా మామూలే. ఐతే జడ్చర్లలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం ఓ కోడి పుంజును లాకప్‌లో ఉంచారు పోలీసులు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా..

Telangana: లాకప్‌లో కోడి పుంజు.. ఇంతకీ నేరం ఏంటంటే..?
Cock
Srilakshmi C
|

Updated on: Jul 11, 2023 | 10:20 AM

Share

జడ్చర్ల: నేరాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి లాకప్‌లలో పెట్టడం షరా మామూలే. ఐతే జడ్చర్లలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం ఓ కోడి పుంజును లాకప్‌లో ఉంచారు పోలీసులు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం వెలుగుచూసింది.

జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి గ్రామ శివారులో రెండు రోజుల కిందట కరివెన గ్రామానికి చెందిన ఓ బాలుడు కోడిపుంజు దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు వచ్చి బాలుడిని, అతనితోపాటు కోడిపుంజునూ స్టేసన్‌కు తీసుకొచ్చారు. నిందితుడు మైనర్‌ కావడంతో తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించి పంపించారు.

కోడిపుంజు ఎవరిదో తెలియక పోవడంతో బయట ఉంచితే కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని పోలీసులు కోడిపుంజునూ లాకప్‌లో ఉంచారు. దానికి గింజలు వేస్తూ పోలీసులు కాపలా కాయటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్టేషన్‌కు వచ్చిన వారందరూ లాకప్‌లో కోడిపుంజును ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. జడ్చర్ల పట్టణ సీఐ రమేశ్‌బాబును వివరణ కోరగా.. కోడి పుంజు పోయిందని ఎవరి నుంచి ఫిర్యాదు అందకపోవడంతో దానికి భద్రత కల్పించేందుకే లాకప్‌లో ఉంచినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!