Bjp vs Trs: ఢిల్లీతో ఢీ అంటున్న గులాబీ దళపతి.. పాలమూరు వేదికగా సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..

మరోసారి ఢిల్లీతో ఢీ అంటున్నారు సీఎం కేసీఆర్. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న అసమర్ధ పాలన వల్ల రాష్ట్రాని..

Bjp vs Trs: ఢిల్లీతో ఢీ అంటున్న గులాబీ దళపతి.. పాలమూరు వేదికగా సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us

|

Updated on: Dec 04, 2022 | 10:09 PM

మరోసారి ఢిల్లీతో ఢీ అంటున్నారు సీఎం కేసీఆర్. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న అసమర్ధ పాలన వల్ల రాష్ట్రాని ఎంతో నష్టం జరుగుతోందన్నారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. పాలమూరు వేదికగా అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారు.తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు పాయింట్ టు పాయింట్‌ వివరిస్తూ.. కేంద్రాన్ని ఢీకొట్టేందుకు ప్రజల ఆశీర్వాదం కోరారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఢిల్లీలో అసమర్థ ప్రభుత్వం ఉందని విమర్శించారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రం బాగుపడుతుంటే అడ్డుపడుతున్నారని.. ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం వేసే చిల్లర ఎత్తుగడలను సీరియస్‌గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగం అవుతాయన్నారు సీఎం కేసీఆర్. కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పేరును ప్రస్తావిస్తూ ప్రజల ఆమోదం కోరారు. తెలంగాణలా దేశాన్ని కూడా బాగుచేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తానన్నారు. అయితే, ఈసారి కూడా తగ్గేదే లే అంటూ మోదీని టార్గెట్‌ చేయడం.. చేసిన అభివృద్ధిని వివరించడం ముందస్తు ప్రచారంలో భాగమేనన్న చర్చ ఊపందుకుంది.

ఇవి కూడా చదవండి

కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు 8ఏళ్లు సరిపోవా అంటూ నిలదీశారు ముఖ్యమంత్రి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకూ కేంద్రం సహకరించడం లేదన్నారు. కేంద్రంలో అసమర్ధ ప్రభుత్వం ఉందన్నారు సీఎం కేసీఆర్. చేతగాని కేంద్ర ప్రభుత్వం కారణంగా తెలంగాణ 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. పైసలు రాకుండా చేయడం, ప్రగతిని అడ్డుకోవడం.. ఎఫ్‌ఆర్‌బీఎంలో కోత విధించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. పాలమూరుకు ఎన్నో చేస్తామన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని కూలగొట్టడమే మీ పద్ధతా అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్. వాళ్లు పని చేయరు.. ఇంకొకర్ని చేయనివ్వరు అంటూ విమర్శించారాయన. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలను పట్టుకుని జెల్లో వేశామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!