CM KCR: కేంద్రంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై ప్రధానిని కలిసే ఛాన్స్..
ధాన్యంపై దంచుడే. కేంద్రంతో తేల్చుకునుడే అని సూటిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ చేరుకున్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అన్నదే ప్రధాన అంశం..
CM KCR Delhi Tour: ధాన్యంపై దంచుడే. కేంద్రంతో తేల్చుకునుడే.. అని సూటిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ చేరుకున్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అన్నదే ప్రధాన అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఏడాది లెక్కన ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా సూటిగా చెప్పాలన్నది ముఖ్యమంత్రి ప్రధాన డిమాండ్. జాతీయ రాజకీయాలపైనా ఫోకస్ చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. రైతు చట్టాల రద్దుకు ఉద్యమించిన రైతులకు సంఘీభావం ప్రకటించారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటంబాలకు అండగా ఒక్కో ఫ్యామిలీకి 3 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. కేంద్రం పాతిక లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నది KCR డిమాండ్.
అటు.. రైతు సంఘాలు కూడా ప్రధానమంత్రి సారీతో చల్లబడలేదు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని ప్రకటించాయి. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రైతు సమస్యలతో పాటు.. విభజన చట్టంలోని అంశాల అమలుపైనా ఫోకస్ చేస్తున్నారాయన. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల కేటాయింపులపై స్పష్టతకు, వివాదాల పరిష్కారానికి ఇంకెన్నేళ్లు కావాలంటూ సూటిగా ప్రశ్నించారు. నీటి పంచాయతీకి ఫుల్‌స్టాప్ పెట్టేలా టైమ్‌బౌండ్ పరిష్కారం కోరుతున్నారాయన.
ఇవి కూడా చదవండి: CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..
SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..
Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..