AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet: హైదరాబాద్ ప్రజలకు పండగే.. ఈ ఏరియాలో మరో పెద్ద రోడ్డుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అభివృద్ది పనులపై ముందడుగు వేస్తూ పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు.

Telangana Cabinet: హైదరాబాద్ ప్రజలకు పండగే.. ఈ ఏరియాలో మరో పెద్ద రోడ్డుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
Telangana Cabinet
Venkatrao Lella
|

Updated on: Jan 19, 2026 | 7:05 AM

Share

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని ఎన్నికల అధికారులకు కేబినెట్ సూచించింది. దీంతో పాటు గోదావరి పుష్కరాలు, హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

గోదావరి పుష్కరాలు ఎప్పటినుంచంటే..?

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు అత్యంత అట్టాహాసంగా జరుగుతాయి. దీంతో ఈ సారి ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసేందుకు ఆమోదముద్ర వేశారు. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖల సంయుక్తంగా డీటేయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

మెట్రో విస్తరణపై కీలక స్టెప్

ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 నాటికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ప్రాజెక్ట్‌ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-IIAలోని నాలుగు కారిడార్లు, ఫేజ్-IIBలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.2,787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూ సేకరణ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.

హైదరాబాద్ ప్రజలకు తీపికబురు

హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్‌కు TGIIC కి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారా హిల్స్‌లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన యంగ్‌ బ్యూటీ!
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన యంగ్‌ బ్యూటీ!