Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణం చేసేదెవరు..?

Telangana Cabinet Expansion: తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు..ఇప్పుడు మరో అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు.. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు ఉన్నందున కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు..మరి ఈ కూర్పులో కొత్త మంత్రులెవరు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 22, 2023 | 9:33 AM

Telangana Cabinet Expansion: తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరపాలని నిర్ణయించుకున్నారట.. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్‌ కోల్పోయిన స్థానిక సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌ ను కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి… బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014లో తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్‌ దక్కించుకోవడంతో.. మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు.

ఒకరికి ఉద్వాసన తప్పదా..?

ఇక గంపా గోవర్ధన్‌ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో రెడ్డి వర్గానికి చెందిన..సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డిలు ఉన్నారు.. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉద్వాసన పలుకుతారో..ఎవరికి పట్టం కడతారో అన్న డైలమా బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..