Bandi Sanjay Padayatra: బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర వాయిదా.. కారణం అదేనా..?
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ నెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది.
BJP President Bandi Sanjay: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ నెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్ అకాల మరణం కారణంగా పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. పార్టీ పరంగా వారం రోజుల పాటు సంతాపదినాలు పాటిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే మాజీ సైనికాధికారులు బీజేపీ పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు.
కాగా, భారతీయ జనతా పార్టీ తొలితరం నాయకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో నడుచుకున్నారని.. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కళ్యాణ్ సింగ్ బతికి ఉన్నంతకాలం అయోధ్యలో శ్రీరాముడి భవ్య రామాలయం కోసం పరితపించారని ఆయన కొనియాడారు. యూపీకి రెండు సార్లు సీఎంగా, రాజస్థాన్ గవర్నర్‌గా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటని బండి సంజయ్ పేర్కొన్నారు.
బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 24న 50వేల మందితో కలిసి ప్రారంభిచాలనుకున్నారు. భాగ్యనగర్ లక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి రాష్ట్ర మొత్తం చుట్టి రావాలని ప్లాన్ చేశారు. కళ్యాణ్ సింగ్ మరణించండం, బీజేపీ అధిష్టానం ఈ నెల 24 వరకు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఆయన యాత్ర వాయిదా వేసుకున్నారు. అయితే, ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రతో వాయిదా వేసుకున్నారు. కళ్యాణ్‌సింగ్ మృతితో ఇప్పుడు మరోసారి బండి సంజయ్ యాత్రకు బ్రేక్ పడింది.
Vijayawada: ఆస్తి తగాదాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి పరిస్థితి విషమం..!