Vijayawada: ఆస్తి తగాదాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి పరిస్థితి విషమం..!
ఆస్తి తగాదాలు ఓ కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. కుటుంబసభ్యుల వేధింపులు తాళలేక ఓ తల్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
Family Suicide attempt: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి తగాదాలు ఓ కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. కుటుంబసభ్యుల వేధింపులు తాళలేక ఓ తల్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఇద్దరు పిల్లలతో సహా కన్న తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన ఇరుగు పొరుగు వారు హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
అయితే, వీరి ఆత్మహత్యకు ఆస్తి వివాదాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏడాది క్రితం భర్త కోవిడ్‌తో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.