Tarun Chug: త్వరలో తెలంగాణలో మార్పు తథ్యం.. టీఆర్ఎస్ సర్కార్‌పై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు..!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో మార్పు తధ్యమన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్రతోనే అది మొదలైందన్నారు.

Tarun Chug: త్వరలో తెలంగాణలో మార్పు తథ్యం.. టీఆర్ఎస్ సర్కార్‌పై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు..!
Tarun Chug

Amit Shah Telangana Tour: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో మార్పు తధ్యమన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్రతోనే అది మొదలైందన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అంతానికి ఈ నెల 17వ తేదీ సభలో సమర శంఖం పూరిస్తామన్నారు. ఆ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వస్తారని తరుణ్‌ఛుగ్‌ చెప్పారు.

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకే ఈనెల 17న ముహూర్తం ఫిక్స్ అయ్యిందన్నారు. ఇందుకు గానూ అమిత్ షా నిర్మల్‌ బహిరంగ సభ వేదికగా సమరశంఖారావం పూరిస్తారన్నారు. ఈనెల 17న నిర్మల్ జిల్లా కేంద్రంలో అమిత్ షా పర్యటన పురస్కరించుకుని స్థానికం ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించింది జిల్లా పార్టీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు పుట్టినగడ్డ తెలంగాణ అని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు వచ్చి.. నిజాం పాలన నుంచి విముక్తి కలిగిస్తే.. 2021 సెప్టెంబర్ 17న ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా.. నేటి టీఆర్ఎస్ సర్కార్ నుంచి విముక్తికి సమర శంఖం పూర్తిస్తారని అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు తథ్యమని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ను సాగనంపేందుకే నిర్మల్ సభ వేదిక కానుందన్నారు. అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని తరుణ్ ఛుగ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. అంతకుముందు అమిత్ షా బహిరం గ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెల్లడించారు.

Read Also…  Oxygen Cylinder Blast: గ్యాస్ సిలెండర్ల ట్రక్ పేలుడు సీసీ టీవీ ఫుటేజ్.. నెట్టింట వైరల్ అవుతున్న బ్లాస్ట్ విజువల్స్

Chinta Mohan: దీపావళి పండుగ లోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి : కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Click on your DTH Provider to Add TV9 Telugu