Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medchal Car Accident: మేడ్చల్‌ జాతీయ రహదారిపై కారు బీభత్సం.. చిన్నారితో సహా ముగ్గురు మృత్యువాత

Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది.

Medchal Car Accident: మేడ్చల్‌ జాతీయ రహదారిపై కారు బీభత్సం.. చిన్నారితో సహా ముగ్గురు మృత్యువాత
Medchal Car Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 11, 2021 | 9:56 PM

Medchal Car Accident: హైదరాబాద్‌ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి.. డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను, ఆటోను ఢీ కొట్టింది. అంతటితో ఆగలేదు. బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లి.. ఓ లారీ కిందకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు భయానకంగా మారాయి.

మేడ్చల్ జాతీయ రహదారిపై ఉన్న అత్వెలి గ్రామ శివారు రేకులబావి వద్ద అతి వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన కారు.. అదుపుతప్పి రాంగ్ రూట్‌లో దూసువచ్చింది. అటు వస్తున్న బైక్‌ను, ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న కొల్తూరు నివాసి సుధీర్ (26), ఆటోలో ప్రయాణిస్తున్న తూప్రాన్ మండల కేంద్రానికి చెందిన నీరజ లావణ్య , ఆమె కుమారుడు కౌశిక్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. స్దానికుల సమాచారం మేరకు ప్రమాద స్ధలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also….  Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్