AP Fiber Grid: ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదులుతోంది.. సీఐడీ విచారణలో వెలుగులోకి కొత్త పేర్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో తీగ లాగితే డొంక ఎక్కడెక్కడో కదులుతోంది. సీఐడీ విచారణలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. రూ.321 కోట్ల అక్రమాలు. 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు.
CID investigation in AP Fiber Grid: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లో తీగ లాగితే డొంక ఎక్కడెక్కడో కదులుతోంది. సీఐడీ విచారణలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. రూ.321 కోట్ల అక్రమాలు. 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు. ఎప్పుడైనా వాళ్లను పిలిచి విచారించే అవకాశముందని తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై మరింతగా ఫోకస్ పెంచింది వైసీపీ సర్కార్. ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో జరిగిన కోట్ల రూపాయల అవకతవకలపై కేసు పెట్టింది. CID ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలింది. గత ప్రభుత్వంలో ఈ-గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, టేరా సాఫ్ట్‌తో లింక్స్ ఉన్న వేమూరి హరిప్రసాద్, ఫైబర్ నెట్ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్ కంపెనీ డైరెక్టర్లు, ప్రభుత్వ అధికారులు సహా 19 మందిపై కేసులు నమోదు చేసింది. ఈ FIRను కోర్టులో సబ్‌మిట్ చేసింది.
నిబంధనలను అతిక్రమించి టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టినట్లు CID గుర్తించింది. కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించి, ఫోర్జరీ పత్రాలు సృష్టించిన తర్వాత టెండర్లు ఫైనల్ చేసినట్లు తేల్చింది. టెక్నికల్ కమిటీలోని నిపుణుల అభ్యంతరాలను పక్కన బెట్టి రూ.330 కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారని విచారణలో బయటపడింది. కనీస పరిశీలన లేకుండానే నాసిరకంగా పరికరాల కోసం 120 కోట్ల చెల్లించినట్లు తేలింది.
మరోవైపు, చంద్రబాబుకు ఇదంతా తెలిసే జరిగిందన్నారు ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి. ఎవరూ తప్పించుకోలేరని, రాజకీయ నేతల ప్రమేయం బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఫైబర్ గ్రిడ్ టెండర్లు కట్టబెట్టారన్నది CID ప్రాథమిక విచారణలో తేలిన అంశం. దీంతో FIRలో ఉన్న వారిని పిలిచి విచారించే అవకాశం ఉంది.
Read Also… Bigg Boss 5 Telugu: తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్న అరియానా.. బిగ్‌బాస్ బజ్ లెటేస్ట్ ప్రోమో….