AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్న అరియానా.. బిగ్‏బాస్ బజ్ లెటేస్ట్ ప్రోమో….

బిగ్‏బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్‏గా దూసుకెళ్తుంది. నిత్యం చిన్న చిన్న గొడవలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చేస్తున్నారు కంటెస్టెంట్స్.

Bigg Boss 5 Telugu: తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్న అరియానా.. బిగ్‏బాస్ బజ్ లెటేస్ట్ ప్రోమో....
Ariyana
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 12, 2021 | 5:01 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్‏గా దూసుకెళ్తుంది. నిత్యం చిన్న చిన్న గొడవలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చేస్తున్నారు కంటెస్టెంట్స్. షో ప్రారంభమై.. వారం రోజులు కావోస్తుంది. ఇక ఈరోజు శనివారం నాగ్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈవారం ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఎవరనేది కూడా తెలియనుంది. తాజాగా బిగ్‏బాస్ సీజన్ 5 బజ్‎కు సంబంధించి లెటేస్ట్ ప్రోమో విడుదల చేశారు నిర్వహకులు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 బజ్‏కు హోస్ట్‏గా వ్యహరించబోతుంది అరియానా. సీజన్ 4లో బోల్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. అనూహ్యంగా ఫైనల్ వరకూ దూసుకొచ్చిన అరియానా గ్లోరి మరోసారి బిగ్ బాస్ ముచ్చట్లతో సర్ ప్రైజ్ చేయనుంది.

గత మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ బజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసి.. వారి ఫీలింగ్స్ తెలుసుకోవడమే బిగ్ బాస్ బజ్ ముఖ్య ఉద్దేశ్యం. మూడో సీజన్ బజ్ షోకు తనీష్ హోస్ట్‏గా వ్యవహరించగా.. నాలుగో సీజన్‏కు రాహుల్ సిప్లిగంజ్ హోస్ట్‏గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్ బజ్‏కు బోల్డ్ బ్యూటీ అరియానా హోస్ట్‏గా వ్యవహరించబోతుంది. ఇక ఇవాళ విడుదలైన ప్రోమోలో కావాల్సినవాళ్లకు కావాల్సినంత.. చూసేవాళ్లకు చూసేంత ఎంటర్‏టైన్మెంట్‏తో మీ బిగ్ బాస్ 5 బజ్. తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటూ వచ్చేసింది అరియానా. బిగ్ బాస్ సీజన్ 5 బజ్ ప్రతి రోజు ఉదయం 10 గంటలకు అలాగే తిరిగి సాయంత్రం 6 గంటలకు మా మ్యూజిక్ ఛానెల్‏లో ప్రసారం కానున్నట్లుగా తెలిపారు.

&nbs

Also Read: Sai Dharam Tej: యంగస్టర్స్ లో సాయి ధరమ్ మెచ్యూర్డ్ ప‌ర్స‌న్.. నరేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న శ్రీకాంత్, నట్టి కుమార్

Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్

Manike Mage Hithe Song: ఆకాశవీధిలో మాణికే సాంగ్ హవా.. ఎయిర్‏హోస్టెస్ డ్యాన్స్‏కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..