Manike Mage Hithe Song: ఆకాశవీధిలో మాణికే సాంగ్ హవా.. ఎయిర్‏హోస్టెస్ డ్యాన్స్‏కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

ట్యూన్ నచ్చిందా.. లైక్ కొట్టాల్సిందే.. భావం అర్థం కాకపోయిన స్టెప్పులెయ్యాల్సిందే.. ఇదే ఇప్పటి ట్రెండ్.. ఏ భాష పాటైన నచ్చిదంటే చాలు..

Manike Mage Hithe Song: ఆకాశవీధిలో మాణికే సాంగ్ హవా.. ఎయిర్‏హోస్టెస్ డ్యాన్స్‏కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 11, 2021 | 7:29 PM

ట్యూన్ నచ్చిందా.. లైక్ కొట్టాల్సిందే.. భావం అర్థం కాకపోయిన స్టెప్పులెయ్యాల్సిందే.. ఇదే ఇప్పటి ట్రెండ్.. ఏ భాష పాటైన నచ్చిదంటే చాలు.. నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించాల్సిందే. ప్రస్తుతం జరుగతున్నది ఇదే. పాట నచ్చితే చాలు.. పదాలకు తగ్గట్టుగా పెదవులు కలుపుతూ స్టెప్పులేస్తూ ఇన్‏స్టా రీల్స్ చేస్తే సెలబ్రెటీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ కావాలంటే పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్న పాటలకు డ్యాన్స్ చేస్తే చాలు. ఇటీవల బుల్లెట్ బండి పాటకు నవవధువు డ్యాన్స్ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. బుల్లెట్ బండి పాటకు పెళ్లు కూతురు చేసిన డ్యాన్స్‏కు ఫిదా అయిపోయారు. అలాగే భాషే తెలియని మాణికే సాంగ్ కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ పాటకు వయసుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు.

ఇంతకుముందు అసలు పరిచయం లేని వారు కూడా రాత్రికి రాత్రే స్టార్‌లుగా మారడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నడుస్తోన్న నయా ట్రెండ్‌. ఇక బుల్లెట్ బండి తర్వాత ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది ‘మాణికే మాగే హితే’ పాట. తాజాగా ఈ పాటకు ఎయిర్‌హోస్టెస్‌ డాన్స్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్స్‌. ఇండిగోలో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తున్న ఆయాత్ ఉర్ఫ్ అఫ్రీన్, విమానం ఆగి ఉన్న సమయంలో మాణికే మాగే హితెకు పాటకు డ్యాన్స్‌ చేసింది. అది కూడా యూనిఫామ్‌లో. ఇక అఫ్రీన్‌ డ్యాన్స్‌ చేస్తుండగా.. ఆమె సహచరులలో ఒకరు వీడియోని రికార్డ్ చేశారు. అనంతరం దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ పాటకు అఫ్రీన్‌ వేసిన స్టెప్పులు ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండి నెటిజనులను ఫిదా చేస్తున్నాయి.  ఇప్పటికే ఈ వీడియోకు 34 లక్షల వ్యూస్‌ పొందింది. ఈ పాట పాడిన గాయని గొంతులోని మాధుర్యం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రసుత్తం ఇది పలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయి.. ఇక్కడి జనాలను కూడా తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటకు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఫిదా అయ్యారు.

Also Read: Bullet Bandi Ganesha: ట్రెండ్ ఫాలో అవుతున్న వినాయక.. బుల్లెట్ బండిపై బొజ్జ గణపయ్య.. ఎక్కడో తెలుసా..

Sai Dharam tej: తేజు మీదనే కాదు.. మున్సిపాలిటీపై, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసుపెట్టమంటున్న మ్యూజిక్ డైరెక్టర్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?