Sai Dharam Tej: యంగస్టర్స్ లో సాయి ధరమ్ మెచ్యూర్డ్ పర్సన్.. నరేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న శ్రీకాంత్, నట్టి కుమార్
Sai Dharam Tej Accident: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నరేష్ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేష్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ..
Sai Dharam Tej Accident: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నరేష్ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేష్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సీనియర్ హీరో శ్రీకాంత్, నిర్మాత నట్టి కుమార్ , నిర్మాత బండ్ల గణేష్ లు వ్యాఖ్యానించారు. సాయి ధరమ్ తేజ్ కు జరిగింది చిన్న ప్రమాదం.. సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి తిరిగి వస్తాడు. ఎవరికైనా సర్వసాధారణంగా జరిగే ప్రమాదమే ఇటువంటి సమయంలో నరేష్ చావుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ని సీనియర్ నటుడు శ్రీకాంత్ అన్నారు. రోడ్డుమీద ఇసుక ఉండడం వలన స్కిట్ అయి పడిపోయిగాయపడ్డారు. త్వరగా కోలుకుంటారు. కోలుకోవాలని మనమందరం కోరుకుంటున్నాం.. ఇదే విషయంపై స్పందించేవారు వీడియో కామెంట్స్ పెట్టేవారు కొంచెం ఆలోచించి పెట్టమని కోరుతున్నారు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ చాలా టెన్షన్ లో ఉన్నారు. ఇటువంటి సమయంలో పెట్టె బైట్స్ వారికి మరింత ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదని.. తనకు నరేష్ పెట్టిన బైట్ కరెక్ట్ కాదనిపిస్తుందని చెప్పారు శ్రీకాంత్. దయచేసి ఎవరైనా సరే ప్రమాదంపై స్పందించే ముందు ఈ విషయం ఆలోచించాలని కోరారు.
శ్రీకాంత్
ఇక నరేష్ వ్యాఖ్యలు తనకు అభ్యంతరకరమని నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. అసలు నరేష్ తన ఇంటి నుంచి వస్తున్నాడని చెప్పారు.. అయితే సాయి ధరమ్ తేజ్ వెళ్తున్న డైరెక్షన్ నరేష్ చెప్పిన మాటలు అబద్ధమనిపిస్తున్నాయంటూ నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై రాజకీయాలు వద్దు.. త్వరగా కోలుకొని షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరగడానికి ముందు మా ఇంటికి కొచ్చాడు రేసింగ్ లు చేశారు అంటూ నరేష్ ఇప్పుడు ఎందుకు చెప్పాలని అన్నారు.
నట్టి కుమార్ వాయిస్:
ఇక రోడ్డు ప్రమాదం ప్రమాదం జరగడానికి ముందు సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్ తెలిపారు. తన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు సాయితేజ్ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు నరేశ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్