Gold Smuggling‌: నోరు మొత్తం బంగారమే..! ఈ స్మగ్లర్ తెలివి మామూలుగా లేదుగా..

Gold Smuggling‌: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా.. గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని

Gold Smuggling‌: నోరు మొత్తం బంగారమే..! ఈ స్మగ్లర్ తెలివి మామూలుగా లేదుగా..
Follow us
uppula Raju

|

Updated on: Sep 11, 2021 | 5:33 PM

Gold Smuggling‌: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా.. గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తున్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఎంత పగడ్భంధీగా తనిఖీలు చేసినా అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. అధికారుల తనిఖీల్లో ఒక్కోసారి బంగారం పట్టుబడకపోయినా స్కానర్లు మాత్రం సైరన్ మోగిస్తున్నాయి. అయితే బంగారం ఎక్కడ దాచారన్నది గుర్తించడం అధికారులకు పరీక్షగానే మారుతోంది. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఓ వ్యక్తి బంగారం తరలించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేయొచ్చని తెలుసుకుంటారు.

ఢిల్లీ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న ఇద్దరు ఉజ్బెకిస్తాన్ పౌరులను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరూ నోట్లో బంగారాన్ని దాచి తీసుకొస్తున్నారు. దాదాపుగా వారి నోటి నుంచి 951 గ్రాముల బంగారం, ఒక గొలుసు లభించాయి. స్మగ్లర్లు తెలివిగా వారి దంతాలపై కూడా బంగారం పూత పూయించుకున్నారు. ఈ కొత్తరకం బంగారం స్మగ్లింగ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విపరీతంగా స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. బంగారం ఇలా కూడా స్మగ్లింగ్‌ చేయొచ్చని కొత్త విషయం చెప్పారని ఒక నెటిజన్‌ అన్నాడు.

తాజాగా దుబాయ్‌ నుంచి బంగారం తీసుకొస్తూ.. ఓ వ్యక్తి శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. 24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని.. చెప్పులు, ఫేస్‌ క్రీము, హెయిర్‌ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తెచ్చాడు. కానీ పక్కా సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని…. బంగారం స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల కిందట ఓ మహిళ గర్భవతిగా నటిస్తూ మూడు కిలోల బంగారం దాచే ప్రయత్నం చేసింది. తెలివిమీరిన స్మగ్లర్లు ఒంటికి బంగారం పూత పూసుకుని.. దెబ్బ తాకిందని బ్యాండేజ్‌తో కవరింగ్ ఇస్తున్నారు.

Viral Video: డోర్ ఓపెన్ చేయగానే మహిళకు గట్టి షాక్.. కాటు వేసేందుకు ప్రయత్నించిన పాము.. వీడియో వైరల్.!

Delhi rains: ఢిల్లీ వరద నీటిలో బోటింగ్ చేసిన బీజేపీ నేత.. ఆప్ ప్రభుత్వ తీరుకు నిరసనగా..

Soybean Ganesh Idol: గణపతి మండపంలో కొలువుదీరిన సోయాబీన్ గణేశుడు.. కేవలం రూ. 1000 లతో తయారీ.. ఎక్కడంటే..