Bandi Sanjay: నేటితో ముగియనున్న బండి సంజయ్‌ యాత్ర.. హుస్నాబాద్‌లో బీజేపీ భారీ సభ సెంటరాఫ్ అట్రాక్షన్ స్మృతి ఇరానీ

36 రోజులు.. 438 కిలోమీటర్లు.. 8 జిల్లాలు.. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 6 పార్లమెంట్‌ నియోజకవర్గాలు.. 35 సభలు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay: నేటితో ముగియనున్న బండి సంజయ్‌ యాత్ర..  హుస్నాబాద్‌లో బీజేపీ భారీ సభ సెంటరాఫ్ అట్రాక్షన్ స్మృతి ఇరానీ
Bandi Sanjay
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 02, 2021 | 2:01 PM

Husnabad Meeting – Bandi Sanjay: 36 రోజులు.. 438 కిలోమీటర్లు.. 8 జిల్లాలు.. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 6 పార్లమెంట్‌ నియోజకవర్గాలు.. 35 సభలు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సాగిన తీరు ఇది. ఆగస్ట్‌ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర యాత్ర… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇవాళ ముగియనుంది.

ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తొలి అడుగు వేసిన బండి సంజయ్.. కాలినడక 438 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. 36రోజుల పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. జనం బాధలు విన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలతోనూ మాట్లాడారు. బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

తొలి దశ ప్రజా సంగ్రామ యాత్రలో 8 జిల్లాలు, 19 అసెంబ్లీ అండ్ 6 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించారు.

బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ప్రతిచోటా ఘనస్వాగతం లభించింది. బోనాలు, మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. అన్ని వర్గాలను కలుస్తూ అందరి సమస్యలు వింటూ, వారికి భరోసా కల్పిస్తూ బండి సంజయ్ పాదయాత్ర సాగింది.

బండి సంజయ్ తొలి దశ పాదయాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాంతో, హుస్నాబాద్ పట్టణమంతా కాషాయమయంగా మారింది. దాదాపు లక్షమందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఆరుగురు కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 24మంది జాతీయ నేతలు హాజరుకానున్నారు.

తొలి దశ పాదయాత్రను విజయవంతంగా ముగించబోతున్న బండి సంజయ్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి అభినందించారు. క్యా బండీ.. కైసో హో.. అచ్చా కియా.. వైసీ హీ ఆగే చలో.. అంటూ ఎంకరేజ్ చేశారు. మంచి పని చేశావ్.. అలాగే ముందుకెళ్లు అంటూ అభినందించారు. ఇక, నేటి హుస్నాబాద్ మహాసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని సెంటరాఫ్ అట్రాక్షన్ కానున్నారు.

Bandi

Read also: Japanese Princess: ప్రేమ కోసం త‌న వార‌స‌త్వ భారీ సంప‌ద‌ను వ‌దులుకొని పెళ్లిపీటలెక్కబోతోన్న జపాన్ యువరాణి

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం