AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపేయండి.. ప్రభుత్వం కీలక ఆదేశం

పిల్లల్లో అలర్జీలు, హే ఫీవర్, ఆస్తమా వంటి సమస్యలకు కోసం ఉపయోగించే అల్మాంట్–కిడ్' సిరప్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిరప్ ను ఎవరూ వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్న తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి గుర్తించింది. ఈ మేరకు ఈ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తల్లిదండ్రులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపేయండి.. ప్రభుత్వం కీలక ఆదేశం
Almont Kid Syrup Ban
Anand T
|

Updated on: Jan 10, 2026 | 2:21 PM

Share

అల్మాంట్–కిడ్’ సిరప్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో అలెర్జీలు, ఉబ్బసం వంటి సమస్యల కోసం వినియోగించే ఈ సిరప్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనేది మోతాదుకు మించి ఉందని.. ఇది ఆరోగ్యానికి హానికరమని డ్రగ్‌ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పొరపాటన కూడా ఈ సిరప్‌ను వాడొద్దని సూచించారు.

అయితే బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ అనే సంస్థ తయారు చేసిన ఈ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు బెంగాల్‌ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ డ్రక్‌ కంట్రోల్ అధికారులు ఈ సిరప్‌ను టెస్ట్ చేయగా అందులో మొతాదుకు మంచి ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తేలింది. దీంతో ఈ సిరప్‌ ఇప్పటికే ఎవరివద్దనైనా ఉంటే వెంటనే దాన్ని వినియోగించడం ఆపేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.