Telangana: పిన్ టు పిన్ పాయింట్స్‌తో సర్కార్‌ను కార్నర్ చేసిన భట్టి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి సర్పంచ్‌ల నిధుల వరకు.. హైదరాబాద్ మెట్రో దగ్గర నుంచి.. ఉద్యోగుల బదిలీల వరకు.. అన్ని అంశాలపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ నడిచింది. సీఎల్పీ నేత భట్టి వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా చర్చ జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి సర్పంచ్‌ల నిధుల వరకు.. హైదరాబాద్ మెట్రో దగ్గర నుంచి.. ఉద్యోగుల బదిలీల వరకు.. అన్ని అంశాలపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ నడిచింది. సీఎల్పీ నేత భట్టి వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా.. రాష్ట్రంలోని అనేక అంశాలు, సమస్యలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికి పక్కాగా సమాధానమిచ్చారు అధికార పార్టీ నేతలు.
రోడ్లమీదనే మర్డర్లు జరుగుతున్నాయనీ.. వాటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజకీయ పార్టీలు నిరసనలు చేస్తుంటే.. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు భట్టి. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేంద్ర నిధులు పక్కదారి పడ్తున్నాయనీ ఆరోపించారు.
భట్టి ఆరోపణలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తు్న్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్లే సర్పంచులకు బిల్లులు ఆగిపోయాయని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి.




కానిస్టేబుల్ ఎంపిక విషయంలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు దారుణంగా ఉన్నాయంటూ భట్టి మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్యం సరిగ్గా అందడం లేదనీ.. మరోవైపు కల్తీ మందులతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి.
భట్టి చెప్పిందే చెప్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు.. భవిష్యత్ లో అక్కడ కూడ కూర్చుంటారో..బయట కూర్చుంటారో.. అంటూ సెటైరికల్‌గా విమర్శించారు. 9 నెలల్లో అధికారంలోకి వస్తామాని కాంగ్రెస్ నేతలు కలలు కంటుంన్నారు.. కానీ అది అసాధ్యమన్నారు. రాష్ట్రంలో పాలనపై కాంగ్రెస్ ఆరోపిస్తే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని హస్తం పార్టీపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..