Telangana: ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్స్‌.. రాష్ట్రంలో 2,652 పరీక్షా కేంద్రాలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 3 నుంచి జరిగే పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు..

Telangana: ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్స్‌.. రాష్ట్రంలో 2,652 పరీక్షా కేంద్రాలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Sabitha Samiksha
Follow us

|

Updated on: Mar 19, 2023 | 6:10 AM

పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 3 నుంచి జరిగే పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి. ఈ సమాక్షా సమాశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు, పాఠశాలలకు కూడా పంపుతున్నట్లు మంత్రితో చెప్పారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరువుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మూడు గంటలు జరిగితే, సైన్స్ పరీక్ష మాత్రం మూడు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది. గతంలోలాగా కాకుండా ఈ సారి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే