Heavy Rain: తెలుగు రాష్ట్రాలను వీడని వాన గండం.. హైదరాబాద్‌లో రాత్రంతా ఎడతెరిపి లేనివాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరపిలేకుండా..

Heavy Rain: తెలుగు రాష్ట్రాలను వీడని వాన గండం.. హైదరాబాద్‌లో రాత్రంతా ఎడతెరిపి లేనివాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Long Rain
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 19, 2023 | 6:39 AM

హైదరాబాద్‌లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరీ ముఖ్యంగా మధ్యరాత్రిలో దంచికొట్టింది వర్షం. దీంతో, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యల్లేకుండా చూసేందుకు ప్రయత్నించారు.

ఆదివారం అత్యధికంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని గాజులరామా రంలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జీడి మెట్లలోనూ ఇదే సీన్‌ కనిపించింది. రామచంద్రాపురంలో 4 సెంటీమీటర్లు, చర్లపల్లిలో 3.6 సెంటీమీటర్ల వర్షం పడింది. దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండడంతో ఈ ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అంటోంది.

ఆదివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హెచ్చరించింది. పిడుగులు, వడగళ్లు పడే ప్రమాదం ఉండడంతో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

రాబోవు మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలా..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:

ఆదివారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

సోమవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

ఆదివారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం.. తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఆదివారం, సోమవారం.. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం