Telangana: ముగిసిన ‘రైతు పండుగ’ వేడుకలు..ఆ కీలక ప్రకటన ఆశించిన రైతులకు నిరాశే 

మహబూబ్‌నగర్ జిల్లా భుత్పూరు మండలం అమిస్తాపూర్‌లో మూడు రోజుల పాటు రైతుల కోసం ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేశారు. ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఆ సభలో సీఎం కానీ మంత్రులు కానీ రైతు భరోసా పేరు మాత్రం ఎత్తకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Telangana: ముగిసిన ‘రైతు పండుగ’ వేడుకలు..ఆ కీలక ప్రకటన ఆశించిన రైతులకు నిరాశే 
Revanth Reddy
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 01, 2024 | 7:03 AM

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమం విజయవంతమైంది. మహబూబ్‌నగర్ జిల్లా భుత్పూరు మండలం అమిస్తాపూర్‌లో మూడు రోజుల పాటు రైతుల కోసం ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేశారు. ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ద్వారా రైతాంగానికి పలు శుభవార్తలు చెబుతారని మంత్రులు ముందే ప్రచారం చేశారు.

అయితే అందరి చూపు ముగింపు సందర్భంగా జరిగే సీఎం సభ వైపుకే మళ్ళింది. రైతు రుణమాఫీ, రైతుబంధుపై కీలక ప్రకటనలు చేస్తారని ఆశించారు. అదే స్థాయిలో మంత్రులు కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది రైతుల ముందు సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారని అందరు ఆశగా ఎదురు చూశారు. అయితే రైతు రుణమాఫీ అంశంలో శుభవార్త విన్న రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఇక కీలకమైన రైతు బంధు అంశం మాత్రం సభలో ఊసే లేదు. ఏ ఎమ్మెల్యే, మంత్రి, చివరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దానిమీద మాట్లాడలేదు. రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతాంగానికి నిరాశ ఎదురైంది.

అయితే రైతు సదస్సు రెండో రోజు మంత్రి తుమ్మల వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని, రాజకీయాలను షేక్ చేశాయి. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు చెబుతున్నారని ఆయన బాంబు పేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బోనస్‌తో రూ.12 వేల నుంచి రూ.15 వేలు ఆదాయం వస్తున్నాయని రైతులు తమ అభిప్రాయాన్ని తెలిపారని చెప్పారు. అయితే ఏది రైతుకు మేలు అనుకుంటే అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ఒక్కసారిగా ముగింపు రోజైన సీఎం రేవంత్ రెడ్డి సభపై చాలా హైప్ పెంచింది. దీంతో మిగిలిన రైతు రుణమాఫీతో పాటు రైతాంగం ఎదురుచూస్తున్న రైతు భరోసాపై నిర్ణయం ప్రకటిస్తారని అనుకున్నారు. దశల వారీగా నిధులు విడుదల ప్రకటిస్తారా? లేక రైతు భరోసా ఎత్తేస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ రైతు పండుగ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆ ఊసే ఎత్తలేదు. దీంతో మరోమారు రైతు భరోసాపై చర్చలు మొదలయ్యాయి. ఏం చేయబోతున్నారు.. పెట్టుబడి సాయం చేస్తారా లేక ఈ అంశంపై మరికొన్ని రోజులు ఇలాగే మౌనం పాటిస్తారా అనేది చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌