దానిమ్మ తొక్కలతో చేసిన టీ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి.
శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేయడంలో కూడా దానిమ్మ తొక్కల టీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెస్ట్, ప్రోస్టేట్, పేగు క్యాన్సర్ దూరమవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ టీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దానిమ్మ టీ ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
చలికాలం వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా దానిమ్మ తొక్కలతో చేసిన టీ బాగా ఉపయోగపడుతుంది. గొంతులో గరగర, కఫం సమస్య దూరమవుతుంది.
షుగర్ పేషెంట్స్‌కి కూడా దానిమ్మ తొక్కలతో చేసిన టీ వరంలాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండేలా చేస్తాయి.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా దానిమ్మ తొక్కలతో చేసిన టీ ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చిగుళ్లు, దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. దంతల సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.