Revanth Reddy: రుణమాఫీపై మోదీ, కేసీఆర్‌తో చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశామన్నారు..సీఎం రేవంత్‌రెడ్డి. రుణమాఫీపై చర్చకు మోదీగానీ కేసీఆర్‌గానీ సిద్ధమా అని సవాల్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండగ సదస్సులో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. రైతులే తన బ్రాండ్‌ అంబాసిడర్లని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మాటలునమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని యువకులను హెచ్చరించారు.

Revanth Reddy: రుణమాఫీపై మోదీ, కేసీఆర్‌తో చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2024 | 7:45 AM

దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. రుణమాఫీ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను అమ్మి రుణమాఫీ చేసిందని, అది కూడా రూ.11 వేల కోట్లే అని ఆరోపించారు సీఎం రేవంత్. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

రుణమాఫీపై మోదీ, కేసీఆర్‌తో చర్చకు సిద్ధం..

తొలి ఏడాదిలోనే రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. ఏడాది పాలనలో రైతుల కోసం రూ. 54 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఒకవేళ కేసీఆర్ తొలి ఏడాది రుణమాఫీ చేసి ఉంటే వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండాపోయేదన్నారు. రుణమాఫీపై ప్రధాని మోదీ, కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.

రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బీమా, మద్దతు ధర.. కాంగ్రెస్ పేటెంట్

రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బీమా, మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఏమిటో తనకు తెలుసన్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వయసులో చిన్నవాడిని అయినా.. మీ ఆశీర్వాదంతో సీఎం కుర్చీ పాలమూరు బిడ్డకు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనాడు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేయలేదన్నారు. అయితే.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలను, మంత్రులను పేరు పేరున అభినందించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..