Andhra Pradesh: అయ్యో దేవుడా.! ఓవర్ స్పీడ్‌లో పేలిన కారు టైర్..కట్ చేస్తే అక్కడిక్కడే నలుగురు మృతి..

ఓవర్ స్పీడ్లో పేలిన కారు టైర్, కట్ చేస్తే అక్కడిక్కడే నలుగురు మృతి.. ఎక్కడో తెలుసా? ఈ ఘటన విజయనగరం జిల్లాలో కేంద్రంలో చోటుచేసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఫార్చ్యూనర్ కారు టైరు పంక్చర్ అయ్యి కారు బోల్తా పడింది.

Andhra Pradesh: అయ్యో దేవుడా.! ఓవర్ స్పీడ్‌లో పేలిన కారు టైర్..కట్ చేస్తే అక్కడిక్కడే నలుగురు మృతి..
Vizianagar Accident
Follow us
G Koteswara Rao

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 01, 2024 | 6:11 AM

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు మృతి చెందారు. భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఫార్చ్యూనర్ కారు టైరు పంక్చర్ అయ్యి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

శ్రీకాకుళం నుండి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలిపల్లి సమీపంలోనే పెట్రోల్ బంక్ వద్ద కారు బోల్తాపడి అక్కడినుండి విశాఖ నుండి శ్రీకాకుళం వెళ్లే రహదారి పైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక మహిళతో పాటు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన గవిడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల డ్రైవర్ జయష్ మృతి చెందారు. వీరిలో వడ్డే అభినవ్, మణిమాల భార్యాభర్తలు కాగా కౌశిక్ అభినవ్ స్నేహితులు.. కౌశిక్ మేనమామ విదేశాల నుండి వస్తుండటంతో అతనిని రిసీవ్ చేసుకునేందుకు కౌశిక్ తన ఫార్చ్యూనర్ కారులో విశాఖకు బయలుదేరాడు. అదే విషయాన్ని ముందు రోజు సాయంత్రం తన స్నేహితుడు అభినవ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అభినవ్ కూడా తన భార్య విశాఖ ఐబీపీఎస్‌లో పరీక్ష రాయాలని, తాము కూడా విశాఖ వస్తామని చెప్పడంతో అందరూ కలిసి కౌశిక్ కారులో బయలుదేరారు. అలా వైజాగ్ వెళ్తుండగా మార్గ మధ్యలో పోలిపల్లి సమీపంలో ప్రమాద సంభవించింది. కౌశిక్ బంగారం షాపు యజమాని కాగా అభినవ్ లియో ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. మృతి చెందిన భార్యాభర్తలకు ఒక ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మరో యువకుడు కౌశిక్‌కు కూడా ఇటీవలే వివాహం జరిగింది. నలుగురు మృతితో శ్రీకాకుళం పట్టణం విషాదంలో మునిగిపోయింది. మృతిచెందిన వారు ప్రముఖ వ్యాపారవేత్తలు కావడంతో నివాళులు అర్పించేందుకు మృతుల కుటుంబాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..