AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-SAFE App: హలో లేడీస్.. ఒంటరిగా ప్రయాణించడానికి భయపడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..

T SAFE.. ఇది మహిళలకు సేఫ్.. అవును.. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఇక భయపడనవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా వెళ్తున్నారు అనే అంశాలు ఈ టి సేఫ్ యాప్ ద్వారా ఎంటర్ చేసుకుంటే చాలు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మీకు ఒక అలర్ట్ కాల్ వస్తుంది.. ఆ అలర్ట్ కాల్ ద్వారా మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న సురక్షితంగా ప్రయాణం చేస్తున్న ఆ సమాచారాన్ని మీరు అధికారులకు తెలియజేయవచ్చు.. అయితే,..

T-SAFE App: హలో లేడీస్.. ఒంటరిగా ప్రయాణించడానికి భయపడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..
T Safe App
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 22, 2025 | 9:02 AM

Share

మహిళల భద్రత మా బాధ్యత అంటూ తెలంగాణ షీ టీమ్స్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఓ సరికొత్త యాప్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.. ఇది ఇండియాలోనే ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీసుగా తెలంగాణ పోలీసులు రూపొందించారు..ఇక మహిళలు ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణించాలంటే ధైర్యంగా వెళ్లొచ్చు.. తాము ఎక్కడికి వెళ్తున్నాము పోలీసులకు సమాచారాన్ని ఇచ్చి ఇక సురక్షిత ప్రయాణం చేయవచ్చు అదెలా అంటే తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో T SAFE అని ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే ఈ యాప్ ను నగరవ్యాప్తంగా 50 వేల మంది మహిళలు వాడుతున్నారు.. కేవలం ఈ యాప్ నగరవ్యాప్తంగా కాకుండా రూరల్ ప్రాంతాల వరకు విస్తరించేలా ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు పోలీస్ అధికారులు.. అసలు ఈ టి సేఫ్ యాప్ అంటే ఏంటి ఈ యాప్ ఎంతవరకు సేఫ్ ఇప్పుడు తెలుసుకుందాం

T SAFE.. ఇది మహిళలకు సేఫ్.. అవును.. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఇక భయపడనవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా వెళ్తున్నారు అనే అంశాలు ఈ టి సేఫ్ యాప్ ద్వారా ఎంటర్ చేసుకుంటే చాలు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మీకు ఒక అలర్ట్ కాల్ వస్తుంది.. ఆ అలర్ట్ కాల్ ద్వారా మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న సురక్షితంగా ప్రయాణం చేస్తున్న ఆ సమాచారాన్ని మీరు అధికారులకు తెలియజేయవచ్చు.. అయితే టి సేఫ్ ని ఏ విధంగా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం..

గూగుల్ ప్లే స్టోర్ లో టి సేఫ్ అని ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఏదైనా వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మొదటగా డైలీ హండ్రెడ్ కాల్ చేసి 8 నెంబర్ను ప్రెస్ చేయాలి అప్పుడు మీ సర్వీసెస్ మానిటరింగ్ లోకి వస్తాయి ఆ తర్వాత మీకు ఒక లింకు వస్తుంది.. మీరు ఉన్నటువంటి డెస్టినేషన్, వెహికల్ టైప్, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి అంశాలు అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ప్రయాణం స్టార్ట్ చేయగానే టి సేఫ్ ఆప్ మీరు వెళ్ళేటటువంటి రూట్ను మానిటరింగ్ చేస్తుంది. ఆ తర్వాత 15 నిమిషాలకు ఒకసారి మీకు ఒక అలర్ట్ కాల్ కంట్రోల్ రూమ్ నుంచి వస్తుంది మీరు సురక్షిత ప్రయాణం చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన కాల్ ద్వారా వాళ్లు అడిగేటటువంటి ఆప్షన్స్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వాళ్ళు అడిగిన ఆప్షన్స్ ను ప్రెస్ చేసిన తర్వాత వెంటనే dail 100 నుంచి మీకు కాల్ వస్తుంది ఆ తర్వాత మీరు మీకున్నటువంటి సమస్యను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మీరు మీ గమ్యస్థానాన్ని సురక్షితంగా ప్రయాణం చేరుకోవచ్చు ఈ యాప్ ను ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలి అంటూ పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..