పరగడుపునే అల్లం, తేనె కలిపి తింటే అదిరిపోయే బెనిఫిట్స్.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
అల్లం, తేనె ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది పెద్దవాల్లు ఉదయాన్నే తేనెతో కలిపి అల్లం ముక్కలు తింటూ ఉంటారు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయని చెబుతారు.. సన్నగా తరిగిన అల్లం ముక్కలు తేనెతో అద్దుకుని తీసుకుంటే శరీరంలో ఊహించని మార్పులు గమనిస్తారని ఆయుర్వే ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రతి రోజూ పరగడుపునే అల్లం, తేనె కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 22, 2025 | 7:01 AM

తేనెలో క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి. నోటి దుర్వాసన పోగొట్టేందుకు అల్లం చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. అల్లం, తేనె కలిపి తీసుకోవటం వల్ల గొంతులోని శ్లేష్మాన్ని తొలగిస్తుంది. అల్లం రోగ నిరోధక లక్షణాలతో కలిసి ఈ మిశ్రమం దగ్గు, జలుబుకు సమర్థవంతమైన సహజ నివారిణిగా పనిచేస్తుంది.

అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది.

అల్లం, తేనె కలిసి సహజ నొప్పి నివారిణిగా పని చేస్తాయి. ఈ మిశ్రమం ఆకలిని పెంచుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తేనె, అల్లం మిశ్రమం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ కు సహాయ పడుతుంది. అల్లం లోని సహజ జీర్ణ లక్షణాలు ఇందుకు దోహదపడుతాయి.

అల్లం తేనె మిశ్రమం కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వికారం, వాంతి తదితర లక్షణాలను ఈ మిశ్రమం తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వేడినీటిలో అల్లం, తేనె కలిపి తీసుకుంటే మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది.

అల్లం, తేనె మిశ్రమంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం, తేనె కలిపి తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషదంలా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. అల్లం, తేనె కాంబినేషన్ మగవారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెబుతున్నారు.




