AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Water Benefits: బ్లాక్‌ వాటర్‌ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి..

బ్లాక్‌ వాటర్‌..ఇటీవలి కాలంలో చాలా ఫేమస్‌ అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్‌ వాటర్‌ తాగతూ ఉన్న ఫొటోలు, వాటర్‌ బాటిల్‌ క్యారీ చేస్తూ ఉన్న ఫొటోలూ తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ బ్లాక్ వాటర్ లో అనేక పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫుల్విక్ మినరల్స్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఎక్కువగా లభిస్తాయని అంటున్నారు.. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jun 22, 2025 | 7:41 AM

Share
బ్లాక్‌ వాటర్‌ ... దీనినే ఆల్కలీన్‌ వాటర్‌ అని కూడా అంటారు. ఇది ఒక ప్రత్యేక రకమైన నీరు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నీటికే కృత్రిమ ఖనిజాలను కలపడం వల్ల అది నలుపు రంగులోకి మారుతుంది. ఆ నీటినే బ్లాక్‌ వాటర్‌గా పిలుస్తున్నారు. దీని పీహెచ్‌ విలువ 8-9 మధ్యలో ఉండి ఆల్కలీన్‌ వాటర్‌గా పని చేస్తుంది. ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తాగడం వల్ల ఆల్కలీన్‌ వాటర్‌కు మరింత ప్రాచుర్యం లభించింది.

1 / 5
సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. బాడీని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. 
ఇందులో ఉండే 70శాతం ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. బాడీని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 70శాతం ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

2 / 5
బ్లాక్‌ వాటర్‌ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలను నివారిస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడే వారందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఈ నీళ్లూ తాగితే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

3 / 5
బ్లాక్‌ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ వాటర్ శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్‌ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో సమర్థంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.

4 / 5
మధుమేహం ఉన్న వారికి కూడా ఈ బ్లాక్ వాటర్ ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ బ్లాక్ వాటర్ లో ఉండే గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్‌ వాటర్‌ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

5 / 5