- Telugu News Photo Gallery Consuming Ghee Roasted Fenugreek Seeds With Milk Will Give These Health Benefits
మెంతులను ఇలా వాడారంటే..100 ఏళ్లు మీ గుండె సేఫ్..! తప్పక తెలుసుకోండి..
మెంతులతో ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక వైద్య పరిశోధనలు సైతం మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నాయి.. ముఖ్యంగా రాత్రి పూట నీళ్లల్లో నానబెట్టిన మెంతి నీరు ఉదయాన్నే తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయట. అయితే, మెంతులను తినేందుకు ఇంతకంటే మెరుగైన, శక్తివంతమైన పద్ధతి మరొకటి ఉందని చెబుతున్నారు. అదేంటంటే.. మెంతులను నెయ్యిలో వేయించి పాలలో కలుపుకుని తీసుకోవడం వల్ల అమోఘమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. ఆ సీక్రెట్స్ ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లా్ల్సిందే..
Updated on: Jun 22, 2025 | 8:18 AM

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసుడు మెంతి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఇది ఫాలో అవుతున్నారు కూడా. పరగడుపునే ఈ నీటిని తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం.. అదే మెంతులను నెయ్యిలో వేయించి పాలలో కలుపుకుని తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.

సాధారణంగా మెంతులు చేదుగా ఉంటాయి. కానీ వాటిని నెయ్యిలో దోరగా వేయించడం వల్ల ఆ చేదుదనం చాలా వరకు తగ్గిపోతుందట. పైగా వీటికి చక్కటి సువాసన వస్తుంది. ఇలా వేయించిన మెంతులకు మంచి రుచి పెరగడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని చెబుతున్నారు.

మెంతులలో మంచి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని నెయ్యితో వేయించినప్పుడు నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేయించిన మెంతులను పాలలో కలపడం వల్ల ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.

మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నెయ్యితో కలిపి తీసుకున్నప్పుడు ఈ గుణం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. నెయ్యితో కలిసినప్పుడు ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వేయించిన మెంతులు పాలతో కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు అందుతాయి. పాలు కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మెంతులు పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తే, పాలు కడుపుకు చల్లదనాన్నిస్తాయి. ఈ రెండింటి కలయిక జీర్ణవ్యవస్థకు ఒక వరం లాంటిది. ఈ మిశ్రమం శరీరంలో పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ మెంతులను కొద్దిగా నెయ్యిలో దోరగా వేయించి, వాటిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం తాగవచ్చు.




