AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్‌… మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్టే..!

రాత్రి నిద్ర లేస్తే.. విశ్రాంతి లేకపోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది, తరచుగా మేల్కొవడం, నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం వంటివి మూత్రపిండాల సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. నిద్రలో తరచుగా కండరాల నొప్పులు, ఆకస్మిక కుదుపులు అలసటను మాత్రమే సూచిస్తాయి. అవి కాల్షియం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను సూచిస్తాయి. ఇది మూత్రపిండాల వైఫల్యం వల్ల సంభవించవచ్చు.

రాత్రిపూట ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్‌... మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్టే..!
Kidney Failure Symptoms
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2025 | 8:46 AM

Share

మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి పనిచేసే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. దాని ఎఫెక్ట్‌ రాత్రిపూట స్పష్టంగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు మన మూత్రపిండాలు ఆరోగ్యంగా లేవని చెప్పటానికి సంకేతాలు అంటున్నారు. అలాంటి లక్షణాల గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే..ఒక్కోసారి మనం చేసే చిన్న నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యం ఉండేందుకు దోహదపడుతుంది. లేదంటే..ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంంటున్నారు నిపుణులు. మీ కిడ్నీ సమస్యల్లో ఉందని చెప్పే కొన్ని సంకేతాలను ఇక్కడ చూద్దాం..

మీరు ఉదయం లేదా అర్ధరాత్రి నిద్ర లేచినప్పుడు మీ కాళ్ళు వాపుగా ఉంటే జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారను. ఎందుకంటే..మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. రాత్రిపూట మేల్కొని తరచుగా బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావడం కూడా సాధారణ విషయం కాదని అంటున్నారు. రెండు నుండి మూడు గంటలకు లేస్తుంటే, మూత్రపిండాలు సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని సంకేతం కావచ్చు అంటున్నారు. రాత్రి బాగా నిద్రపోయినా మీరు రోజంతా తల తిరుగుతున్నట్లు, నిరంతరం అలసిపోయినట్లు, నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే మీ మూత్రపిండాలు మీ శరీరం నుండి టాక్సిన్స్ తొలగించలేకపోతున్నాయని అర్థం.

మూత్రపిండాలు తమ పనిని చేయడంలో విఫలమైనప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. ఇది ఊపిరితిత్తులకు చేరుతుంది. నిద్రలో ఈ సమస్య గుర్తించదగినదిగా మారుతుంది. రాత్రి నిద్ర లేస్తే.. విశ్రాంతి లేకపోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది, తరచుగా మేల్కొవడం, నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం వంటివి మూత్రపిండాల సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. నిద్రలో తరచుగా కండరాల నొప్పులు, ఆకస్మిక కుదుపులు అలసటను మాత్రమే సూచిస్తాయి. అవి కాల్షియం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను సూచిస్తాయి. ఇది మూత్రపిండాల వైఫల్యం వల్ల సంభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..