Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: తెలంగాణ బీజేపీకి డబుల్ షాక్.. టీఆర్ఎస్‌ పార్టీలోకి ఆ ఇద్దరు నేతల జంప్.. ముహూర్తం ఎప్పుడంటే..

కొన్ని రోజులుగా ముఖ్య నేతలు బీజేపీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్‌ పార్టీని వీడిగా.. టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నేత బీజేపీకి గుడ్‌ బై చెప్పారు.

TRS: తెలంగాణ బీజేపీకి డబుల్ షాక్.. టీఆర్ఎస్‌ పార్టీలోకి ఆ ఇద్దరు నేతల జంప్.. ముహూర్తం ఎప్పుడంటే..
Dasoju Sravan And Swamy Goud
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 21, 2022 | 3:58 PM

మునుగోడు ఎన్నికల హీట్ పెరుగుతుండటంతో జంపింగ్ జపాంగ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆపార్టీలోకి దూకుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. నాయకులు పార్టీలు మారుతుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బైపోల్‌ హీట్‌ మరింత పెరిగింది. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మునుగోడు పరిధిలో చోటా మోటా నేతలు కండువాలు మార్చేస్తుంటే రాష్ట్ర స్థాయిలోనూ కీలక నేతలు కండువా మార్చేస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఆపరేషన్‌ ఆకర్ష్‌ రాజకీయం ఆసక్తిగా సాగుతోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో ఈ గేమ్‌ మొదలైంది. గులాబీకి గుడ్‌బై చెప్పి బూర నర్సయ్య గౌడ్‌ కాషాయ కండువా కప్పుకోవడంతో టీఆర్‌ఎస్‌ కూడా అలర్ట్‌ అయింది.

పాత నేతలకు టచ్‌లోకి వెళ్లింది. బీజేపీలోకి వెళ్లిన వారిని మళ్లీ చేర్చుకోవడం ద్వారా గట్టి దెబ్బకొట్టాలని ప్లాన్‌ చూస్తోంది. అయితే.. దీనికి ఆ పార్టీ నష్టనివారణ చర్యలు దిగినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు బీజేపీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్‌ పార్టీని వీడిగా.. టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నేత బీజేపీకి గుడ్‌ బై చెప్పారు.

ప్రత్యర్థ పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ కార్యక్రమంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు మహిళ ఎంపీపీ పల్లె రవి దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరగా.. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేత స్వామి గౌడ్‌ అటు నుంచి ఇటు చేరారు. అయితే.. ఆయన నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. ఇక బీజేపీ స్వామి గౌడ్‌‌కి రాజీనామా చేసి.. రేపో మాపో గులాబీ గూటిలో చేరిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

పార్టీకి లేఖ రాసిన స్వామి గౌడ్..

జితేందర్‌రెడ్డి, స్వామిగౌడ్‌, విఠల్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీళ్లలో ఇప్పటికే స్వామిగౌడ్.. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ధనవంతులు, బడా కాంట్రాక్టర్లకు ప్రాధాన్యతనిస్తూ.. తమ లాంటి నాయకులకు పార్టీలో ఇస్తున్న గుర్తింపు ఆక్షేపనీయంగా ఉందంటూ రాజీనామా లేఖలో రాశారు స్వామి గౌడ్.

Swamy Goud

Swamy Goud

టీఆర్ఎస్‌లోకి దాసోజు శ్రవణ్‌

దాసోజు శ్రవణ్‌ రూపంలో బీజేపీని గట్టి దెబ్బకొట్టింది టీఆర్‌ఎస్‌. ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్న శ్రవణ్‌ కొద్దిరోజుల్లోనే రాం రాం చెప్పేశారు. సాయంత్రం కారెక్కబోతున్నారు. శ్రవణ్‌తోపాటు మరికొంతమంది నేతలకు టీఆర్‌ఎస్‌ టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఉండి రెండున్నర నెలల కిందటే కాషాయ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్‌ మళ్లీ కండువా మార్చబోతున్నారు. ఆయన బీజేపీకి రాంరాం చెప్పేశారు. రాజీనామా లేఖను బండి సంజయ్‌కు పంపారు. ఈ సాయంత్రం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దాసోజు. ఇప్పుడు బీజేపీపైనా విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అనిశ్చితమైన, దశ, దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని మండిపడ్డారు.

Dasoju Sravan

Dasoju Sravan

పార్టీలో దశ, దిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. మునుగోడులో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని ఆరోపించారు. పార్టీ తీరును నిరసిస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని తెలిపారు. ఈ మేరకు దాసోజు శ్రవణ్ బండి సంజయ్‌కి రాజీనామా లేఖ పంపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..