AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెండింగ్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడబోతున్నాయా?.. బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండడంతో మరింత ఆలస్యం కానున్నాయా..? హైకోర్టు డెడ్‌లైన్‌ దగ్గర పడుతుండడంతో గడువు కోరేందుకు సిద్ధమవుతోందా..? ఇంతకీ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్‌ సర్కార్‌ ఆలోచనేంటి..? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

పెండింగ్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?
Telangana Panchayat Elections
Balaraju Goud
|

Updated on: Sep 14, 2025 | 7:39 AM

Share

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉండగా.. దీనిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలకు వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గవర్నర్‌కు పంపిన బిల్లు ఆమోదం పెండింగ్‌లో ఉండడంతో దీనిపై ఏం చేయాలనేది ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా సమాలోచనలు చేస్తున్నారు. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు గడువు రేవంత్‌ ప్రభుత్వాన్ని తరముకొస్తుంది. ఒకవైపు.. గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడం.. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే నిబంధనలతోనూ స్థానిక ఎన్నికల నిర్వహణపై రేవంత్‌ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఇక.. ఆయా పరిణామాలతోనే స్థానిక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సమయం కలిసి వస్తే.. లాంగ్‌ పోస్ట్‌పోన్‌కు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో.. ఈ ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీలైనంత త్వరగా జరిగితే.. ఆపై.. అక్టోబర్‌ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ కూడా స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

మొత్తంగా.. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతోపాటు.. హైకోర్టును గడువు కోరేందుకు యోచిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలోనే సీరియస్‌ కామెంట్స్‌ చేసిన హైకోర్టు.. ప్రభుత్వం మళ్లీ గడువు కోరితే ఎలా రియాక్ట్‌ అవుతుందనేది కూడా ఆసక్తి రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..